

సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్ రావు, గొటేటి మోహన్ సారథ్యంలో జరిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అధ్యక్షులుగా బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా ఈ. జనార్ధన్ రెడ్డి మరియు ఎం.డి. అబ్దుల్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్ మరియు భాగవతుల మురళి, కోశాధికారిగా చదలవాడ భరద్వాజ ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా గిరిధర్, నరసింహ, సాయిరమేష్, ఆర్డీఎస్ ప్రకాష్, నవీన్, గోరంట్ల రవి, అప్పాజీ శ్యామ్, చందు రమేష్, టి. కేశవాచారి తదితరులు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు ప్రభు మాట్లాడుతూ 1969లో స్థాపించబడిన ఈ అసోసియేషన్‌కు గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు. సభ్యుల స్వంత ఇళ్ల కలను సాకారం చేయడానికి ముందుకొచ్చిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడు బత్తుల ప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి అసోసియేషన్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. సీనియర్ సభ్యులు అసోసియేషన్ ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!