
జనరల్

హైదరాబాద్‌లో 15-05-2026న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కీలక సమావేశం జరిగింది. థియేటర్ పర్సంటేజీ విధానంపై నెలకొన్న వివాదానికి పరిష్కారం కనుగొనడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం.

ఈ సమస్య పరిష్కారానికి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధులతో కూడిన ఈ కమిటీ పర్సంటేజీ విధానంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!