
జనరల్

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ విడుదల తేదీపై ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమా 2027 మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రచారంలో ఉంది. అలాగే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘ఫౌజీ’ టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ప్రభాస్ డిసెంబర్ మొదటి వారంలోగా తన మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయనున్నారని, ఆయనకు ఇంకా సుమారు 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. అనంతరం డిసెంబర్ రెండో వారం నుంచి ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారని, దాదాపు రెండు నెలల పాటు వరుసగా షూటింగ్ షెడ్యూల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!