
రాజకీయాలు

ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా”లో దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై చివర్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ విలువల నేపథ్యంతో ఈ కథ రూపొందించబడింది. మురళీధర్ గౌడ్, సుధ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా దివిజ ప్రభాకర్‌కు టాలీవుడ్‌లో మంచి ఆరంభం ఇస్తుందని ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!