

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దృశ్యం ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక అభిమాన వర్గం ఉండటంతో మూడో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్ ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కేరళలో రికార్డు స్థాయి టికెట్ సేల్స్ నమోదవుతుండగా, తొలి రోజు కలెక్షన్స్ విషయంలో ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!