
సినిమాలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రణబాలి’ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. విజయ్ దేవరకొండ ఫోటోను షేర్ చేస్తూ, ఈ ఫోటోను షేర్ చేయొచ్చో లేదో తెలియదని, కానీ ఒక కీలక సన్నివేశం కోసం విజయ్, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో పాటు మొత్తం బృందం ఎంతో కష్టపడుతోందని తెలిపింది. ఆ సన్నివేశాన్ని పెద్ద తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది. రష్మిక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!