

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న స్పెషల్ గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి మేకర్స్ సాధారణ డిజిటల్ రిలీజ్‌కు పరిమితం కాకుండా, ముంబైలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి జాతీయ స్థాయిలో భారీ ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఉత్తరాదిలో ఎన్టీఆర్‌కు పెరుగుతున్న క్రేజ్‌ను మరింత బలపరిచేలా నిర్మాతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. 2027 వచ్చే నెల 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 19 అర్ధరాత్రి విడుదల కానున్న గ్లింప్స్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!