
ఆరోగ్యం

మలేషియాలోని లబువాన్ ఎయిర్‌పోర్టులో రన్‌వే సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటిదిగా భావిస్తున్న పేలని బాంబు లభ్యమవడంతో కలకలం రేగింది. ఈ బాంబు రన్‌వేకు సుమారు 200 మీటర్ల దూరంలో, కేరుపాంగ్ సమీపంలోని రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్థలంలో గుర్తించారు.
బాంబు గుర్తించిన వెంటనే అధికారులు భద్రతా చర్యలు చేపట్టి పరిసర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు కార్యకలాపాలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడగా, బాంబును నిర్వీర్యం చేసేందుకు బాంబు నిర్వీర్య దళాలు చర్యలు ప్రారంభించాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!