

ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త డా. ఎం. మోహన్ బాబుకి ప్రతిష్టాత్మక గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు సినిమాకు ఆయన చేసిన అపూర్వ సేవలతో పాటు, వేలాది పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ సమాజానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించారు. ఈ అవార్డును ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్కతాలోని లోక్ భవన్లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సమక్షంలో ప్రదానం చేయనున్నారు. అనంతరం సంప్రదాయంగా అట్ హోమ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక తెలుగు నటుడికి ఈ స్థాయి ఎక్సలెన్స్ అవార్డును అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఐదు దశాబ్దాలకు పైగా భారతీయ సినిమా రంగానికి సేవలందించిన మోహన్ బాబు సినీ ప్రయాణం క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం. నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా విద్యా రంగంలో ఆయన చేసిన కృషి తరతరాలపై శాశ్వత ముద్ర వేస్తోంది. ఈ గౌరవం మోహన్ బాబు వ్యక్తిగత మైలురాయిగా మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే ఘనతగా నిలవనుంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!