

తమిళ బ్లాక్‌బస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తొలి చిత్రం డీసీ, దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు అరున్ మథేశ్వరన్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అయితే, లోకేష్ ఈ సినిమాకి సుమారు రూ. 35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటనతో పాటు స్క్రిప్ట్ పనిలో కూడా ఆయన భాగస్వామ్యమై ఉండటమే దీనికి కారణమని వార్తలు చెబుతున్నాయి.
తన గత దర్శకత్వ చిత్రం కూలీ ప్రచారంలో ఉన్నప్పుడు, లోకేష్ స్వయంగా తన పారితోషికం రూ. 50 కోట్లు అని వెల్లడించాడు. దీంతో, ఆయన నటిస్తున్న డీసీకి కూడా అధిక పారితోషికం తీసుకోవడం సహజమని కొందరు భావిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది సినిమా బడ్జెట్‌ను పెంచుతుందని, నిర్మాతలకు ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ రూమర్స్‌పై లోకేష్ లేదా సినిమా బృందం ఎలాంటి స్పందన ఇవ్వలేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!