
న్యూస్

రణవీర్‌సింగ్ హీరోగా 'ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) సినిమా ట్రైలర్ గురించి అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో హై-ఆక్టేన్ స్పై-యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.
జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ధర్ నిర్మించారు. ఈ చిత్రంలో రణవీర్‌సింగ్ జస్కిరత్ సింగ్ రంగి, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!