

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘రాఫా’ డాక్యుమెంటరీని వీక్షించిన అనంతరం నటుడు ధనుష్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. నాదల్ కెరీర్‌లో ఎదుర్కొన్న శారీరక, మానసిక సవాళ్లను ఈ డాక్యుమెంటరీ ద్వారా పూర్తిగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. మ్యాచ్‌లలో ఓడినప్పుడు లేదా పాయింట్లు కోల్పోయినప్పుడు అభిమానిగా తాను విమర్శించేవాడినని, కానీ ఆ సమయంలో నాదల్ ఎంతటి నొప్పిని భరిస్తూ ఆడాడో ఇప్పుడు తెలిసిందని వెల్లడించారు.
నాదల్ కేవలం గొప్ప క్రీడాకారుడు మాత్రమే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడని ధనుష్ కొనియాడారు. “ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే GOAT (Greatest Of All Time)” అని అభివర్ణించారు. మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రాఫా’ డాక్యుమెంటరీలో నాదల్ విజయాలు, పోరాటాలు, వ్యక్తిగత జీవితం, కెరీర్‌లోని కీలక ఘట్టాలను హృదయానికి హత్తుకునేలా చూపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!