

తమిళ యాక్షన్ డ్రామా “DC” ట్రైలర్ సినిమాప్రేమికుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తొలిసారి నటుడిగా కనిపించడం ఈ సినిమాకు ప్రత్యేక హైప్ తీసుకొచ్చింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్లాసిక్ డెవదాస్ కథను డార్క్, వైలెంట్ వెర్షన్‌గా చూపిస్తోంది. వామికా గబ్బి హీరోయిన్గా చంద్రముఖి పాత్రలో కనిపించనుండగా, యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ట్రైలర్ బ్లాక్ అండ్ వైట్ షాట్స్‌తో ప్రారంభమై గందరగోళం, గన్‌ఫైర్, సస్పెన్స్‌తో ఇంటెన్స్‌గా సాగుతుంది. లోకేశ్ కనగరాజ్ దేవదాస్ పాత్రలో బాధ, హింస, భావోద్వేగాల మధ్య చిక్కుకున్న వ్యక్తిగా కనిపిస్తాడు. దేవదాస్–చంద్ర కెమిస్ట్రీ కథకు ఎమోషనల్ డెప్త్ ఇస్తుండగా, ఫైట్ సీన్స్ మరియు కార్ చేజ్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముకేష్ జి సినిమాటోగ్రఫీ సినిమాకు గ్రాండ్ లుక్ ఇచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!