

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్‌తో విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ఈ చిత్రం మంచి రన్ కొనసాగిస్తోంది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ చిత్ర బృందంతో చేసిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ప్రభాస్ పంచుకున్న ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవడంతో టికెట్ బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో మూవీ ట్రెండింగ్‌లో నిలిచింది. రెండో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లు నమోదు చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా, అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఏపీ, తెలంగాణలో ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని విడుదల చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!