

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించి తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో, నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు జాతీయ చిత్రంతో పాటు బెస్ట్ మేకప్ విభాగంలో జాతీయ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో చిత్రబృందం తమ ఆనందాన్ని పంచుకుంది.
మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ఈ సినిమా తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని పేర్కొన్నారు. అవార్డుల కోసం సినిమా నిర్మించకపోయినా, జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం తన కల నెరవేరినట్టేనని చెప్పారు. దర్శకుడు యదు వంశీ కథపై మొదటి నుంచే నమ్మకం వ్యక్తం చేశారని, కొత్తవారిపై విశ్వాసం ఉంచి సినిమా నిర్మించామని తెలిపారు. దర్శకుడు యదు వంశీ, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు కూడా ఈ విజయం మొత్తం టీమ్ కష్టానికి దక్కిన గౌరవమని పేర్కొంటూ మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!