

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాలో నయనతార కథానాయికగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల మేకర్స్ ‘వరప్రసాద్ టీమ్’ పోస్టర్ను విడుదల చేశారు, ఇందులో హర్షవర్థన్, కేథరిన్, అభినవ్ గోమఠం వంటి ఇతర నటీనటులు చిరంజీవి వెనక నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
సినిమా విడుదలకు కేవలం 9 రోజుల సమయం మిగిలి ఉండటంతో, ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి 3 న రాజమండ్రి నుంచి మొదలయ్యే ప్రచారం తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్, తాడేపల్లిగూడెం, విశాఖ, అనంతపురం, వరంగల్, బెంగళూరు వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాల్లో కొన్ని వేదికల్లో చిరంజీవి స్వయంగా పాల్గొననున్నారు. తిరుపతి లో ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నారు. దీని రన్టైమ్ 2 నిమిషాలు 30 సెకన్లు అని అనిల్ రావిపూడి తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!