
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్ చివరి దశలో ఉంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ సంక్రాంతి 2026 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుండగా, మెగాస్టార్ ఈ చిత్రానికి తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి ఈ చిత్రానికి రూ. 72 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అంతేకాక, సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన కుమార్తె సుస్మిత కొణిదెలకు 50% లాభ భాగస్వామ్యం ఉండనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ బడ్జెట్, బిజినెస్ రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుందన్నదానిపై సినీ సర్కిల్స్ లో ఆసక్తి పెరిగింది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తుండగా, నయనతార హీరోయిన్గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!