

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది ‘ది వాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.91.49 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు, ఈ ఏడాది విడుదలైన ‘ఓదెల 2’లోనూ తమన్నా కీలక పాత్రలో కనిపించింది.
ఇక సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు రచించిన ఫొటో వ్యాసాల పుస్తకం ‘డిసప్పియరింగ్ ఫేసెస్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తమన్నా సద్గురు పాదాలకు నమస్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గతంలోనూ తనకు శివుడిపై ఉన్న భక్తి, కోయంబత్తూరులోని సద్గురు ఇషా యోగా కేంద్రాన్ని సందర్శించిన అనుభవాల గురించి తమన్నా వెల్లడించింది. మహా శివరాత్రి వేడుకల్లోనూ ఆమె పాల్గొంది. ప్రస్తుతం తమన్నా ‘ది వాన్’ సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!