
సినిమాలు

చిరంజీవి మదర్స్ డే సందర్భంగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘అమ్మ మన మొదటి గురువు, ధైర్యం, మన విజయాల వెనుక నిలిచే త్యాగం’’ అంటూ సోషల్ మీడియాలో కుటుంబంతో కలిసి దిగిన పాత ఫొటోలను షేర్ చేశారు. కనిపించే దైవం కూడా కనిపెంచిన తల్లికి తర్వాతేనని పేర్కొంటూ, ప్రతి అడుగులోనూ తల్లి ఆశీర్వాదం ఉంటుందని భావోద్వేగంగా చెప్పారు.
ఇతర సినీ ప్రముఖులు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాశీఖన్నా మాట్లాడుతూ, ‘‘నువ్వు అచ్చం మీ అమ్మలానే ఉన్నావు’’ అని చెప్పడం తనకు పెద్ద ప్రశంస అని పేర్కొన్నారు. రుక్మిణి వసంత్ తన తల్లిని జీవితంలో ఎప్పుడూ ప్రోత్సహించే వ్యక్తిగా కొనియాడారు. సినీ ప్రముఖుల పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!