
న్యూస్

మెగాస్టార్ చిరంజీవి తన కూతురు సుస్మిత కొనిదెల పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగభరితమైన పోస్టు చేశారు. చిన్నప్పుడెప్పుడో తన వేళ్లు పట్టుకుని నడిచిన చిన్నారి, ఇప్పుడు బాధ్యతాయుతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన మహిళగా ఎదిగినందుకు తండ్రిగా ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఆమె జీవితం ఆరోగ్యం, ఆనందం, విజయాలతో నిండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
.png)
తాను నటించిన సినిమాలను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన తన కూతురు ఇప్పుడు నిర్మాతగా మారి తనకే ఒక బ్లాక్‌బస్టర్ సినిమా అందించడం తండ్రిగా తనకు ఎంతో ప్రత్యేకమైన క్షణమని చిరంజీవి పేర్కొన్నారు. తన ప్రియమైన “హనీ పాపా” ఎప్పుడూ వెలుగుతూ విజయాలతో ముందుకు సాగాలని కోరుతూ ప్రేమతో ఆశీర్వాదాలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!