
జనరల్

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమై పరిశ్రమలో కొనసాగుతున్న పర్సెంటేజ్ విధానంపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు శేఖర్ రావు, కార్యదర్శి శ్రీధర్ తో పాటు అనుపమ్ రెడ్డి, బాలగోవింద్ రాజు, భరత్ నారంగ్ తదితరులు హాజరయ్యారు. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సెంటేజ్ విధానం, ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
ఇదివరకే సోమవారం కూడా ఎగ్జిబిటర్లు చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించినట్లు తెలుస్తోంది. అనంతరం మరోసారి చర్చలకు పిలుపునిచ్చిన చిరంజీవి, సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు జరగనున్న కీలక సమావేశంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న పర్సెంటేజ్ వివాదానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!