
సినిమాలు

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం నుంచి రెండో సింగిల్ ‘వదలనే’ ఈ నెల 25 న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది.ఎస్‌కేన్, సాయి రాజేష్ సంయుక్తంగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘గురుతుందా’ పాటతో ప్రారంభమైన మ్యూజికల్ జర్నీకి కొనసాగింపుగా ఈ కొత్త పాట రాబోతోంది.

‘వదలనే’ ఒక ఎమోషనల్ లవ్ సాంగ్‌గా ఉంటుందని పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నాయుడు ఎడిటింగ్ చేశారు. చిత్రబృందం త్వరలోనే సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!