

న్యాచురల్ స్టార్ నాని తన రాబోయే చిత్రం ది ప్యారడైజ్తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో దసరా, హాయ్ నాన్న, హిట్ 3 చిత్రాలకు ఇతర భాషల్లో విస్తృతంగా ప్రమోషన్లు నిర్వహించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల బయట ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అయితే ది ప్యారడైజ్ ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో నాని ఉన్నట్లు సమాచారం.
ఈ చిత్రం కోసం నిర్మాతలు భారీ ప్రమోషన్ బడ్జెట్ను కేటాయించడంతో పాటు హిందీ సహా పలు భాషల్లో రికార్డు స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడటంతో, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!