

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సనా, తాజాగా రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాను తెరకెక్కించారు. ఆయన స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అనే విషయం తెలిసిందే. బుచ్చిబాబు తన గురువు ఫాలో చేసిన ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌ను కొంతవరకు అనుసరిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుకుమార్ ఎదుర్కొన్న విమర్శల తరహానే ఇప్పుడు బుచ్చిబాబు కూడా ఎదుర్కొంటున్నారని టాక్ వినిపిస్తోంది.
సుకుమార్ తన మొదటి హిట్ ‘ఆర్య’ తర్వాత చేసిన ‘జగడం’ సినిమాపై హీరోయిన్ పాత్ర బోల్డ్‌గా చూపించారన్న విమర్శలు వచ్చాయి. అదే తరహాలో ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై కూడా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బుచ్చిబాబు సనా స్పందించి క్షమాపణలు చెప్పడంతో పాటు కొన్ని సన్నివేశాలను తొలగిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!