

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో సినిమా ప్రపంచాన్ని, ముఖ్య పాత్రలను పరిచయం చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా బాబీ సర్కార్ అనే పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ నటిస్తున్నట్లు సమాచారం.
మొదట ఈ పాత్ర కోసం మలయాళ నటుడు టోవినో థామస్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, డేట్స్ సమస్యల కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథలో ఎన్టీఆర్ పోషిస్తున్న లూగర్ పాత్రకు, బాబీ సర్కార్ పాత్రకు అన్నదమ్ముల సంబంధం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్రశాంత్ నీల్ దక్షిణాది నటులకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఈసారి కీలక పాత్ర కోసం హిందీ నటుడిని ఎంపిక చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!