
జనరల్

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా మే 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా అర్జున్ సర్జా మాట్లాడుతూ, మహిళా సాధికారతతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన శక్తివంతమైన కథగా ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. అభిరామి, ప్రీతి ముకుందన్ నటన, రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్రధాన బలమని తెలిపారు. దర్శకుడు సుభాష్ కె రాజ్ ఈ సినిమాను విభిన్నంగా రూపొందించారని చిత్ర బృందం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!