

హైదరాబాద్ నగరంలో ప్రముఖ నటి కే. దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో బాపు బొమ్మ విశ్వ మహిళ పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2026 లో ఈ పురస్కారాలను ప్రారంభించి వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సత్కరించారు. తొలి పురస్కారం మెగా తల్లిగా పేరొందిన కొణిదెల అంజనా దేవికి అందించారు. అలాగే శ్యామలాదేవి, స్వప్న, సమీర భరద్వాజ్ తదితర మహిళలను కూడా సత్కరించారు.
ఈ కార్యక్రమం దసపల్లా హోటల్లో నిర్వహించగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మహిళలు సాధించిన విజయాలను గౌరవించడం మరియు మరింత మంది మహిళలకు ప్రేరణ కల్పించడమే ఈ పురస్కారాల లక్ష్యమని దివ్యవాణి తెలిపారు. మహిళా సాధికారత కోసం చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వంకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఈ పురస్కారాలను దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!