
ఓటీటీ

నందమూరి బాలకృష్ణ–వివేక్ ఆత్రేయ కాంబోలో ఓ భారీ సినిమా రెండు భాగాలుగా రూపొందనుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ దసరా తర్వాత ప్రారంభమవుతుందని కూడా టాక్ వినిపించింది. అయితే అధికారిక ప్రకటన రాకపోయినా ఈ సినిమా దాదాపు ఖరారైందనే అభిప్రాయం అభిమానుల్లో ఏర్పడింది.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబో ప్రాజెక్ట్ ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. కారణాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పుడు రవితేజకు కథ వినిపించగా, ఆ కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!