
జనరల్

నందమూరి బాలకృష్ణ హీరోగా, ఆయనకు గతంలో హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’ సినిమా తెరకెక్కుతోంది. స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి తొలి పాటను నవంబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రత్యేకమైన ఐటెం సాంగ్గా రాబోతున్న ఈ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ పాటను స్వయంగా బాలకృష్ణ పాడినట్లు చిత్ర బృందం కన్ఫర్మ్ చేసింది. గతంలో ‘పైసా వసూల్’ సినిమా టైటిల్ సాంగ్ పాడిన బాలయ్య, చాలా కాలం తర్వాత మరోసారి గాయకుడిగా అలరించనున్నారు. సంగీత దర్శకుడు థమన్ ఈ పాటతో ఎలాంటి మ్యూజికల్ ట్రీట్ అందిస్తారో చూడాలి. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ‘దాదా’ చిత్రం డిసెంబర్ 24న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!