

సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన దర్శకుల సినిమాల్లో గుర్తింపు, ఆత్మగౌరవం కోసం పోరాటం అనే ఎమోషన్ పదేపదే కనిపిస్తోందనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. గతంలో తమిళ సినిమాల్లో సామాజిక అన్యాయం, వెలివేత, గౌరవం కోసం పోరాటం వంటి అంశాల చుట్టూ కథలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు అదే తరహా భావోద్వేగాలను తెలుగు కమర్షియల్ సినిమాలు తమదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ ధోరణికి పుష్ప ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర తనకంటూ గుర్తింపు, గౌరవం సంపాదించుకోవడానికి చేసే పోరాటం కథకు కీలకంగా మారింది. ఆ తర్వాత బుచ్చిబాబు సాన తెరకెక్కించిన పెద్ది, శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ది పారడైజ్ చిత్రాల్లోనూ భిన్నమైన నేపథ్యాలతో ఇలాంటి భావోద్వేగాన్ని చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ది స్పోర్ట్స్ డ్రామా నేపథ్యాన్ని ఎంచుకోగా, ది పారడైజ్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఒక సమూహం గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని చూపిస్తుంది. అయితే తక్కువ వ్యవధిలో ఇలాంటి భావోద్వేగాలు వరుసగా రావడం వల్ల ప్రేక్షకులకు కొత్తదనం తగ్గే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. విజువల్స్, టెక్నికల్ అంశాల్లో యువ దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ, భవిష్యత్తులో మరింత వైవిధ్యమైన కథలు, కొత్త సమస్యలు, భిన్నమైన ఎమోషన్లను ఎంచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!