

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్, నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడు. శివాజీ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వ్యతిరేకతను రేకెత్తించినప్పటికీ సోషల్ మీడియాలో మద్దతు లభించగా, అన్వేష్ వీడియోల్లో పచ్చి బూతులు మాట్లాడుతూ సీతాదేవి, ద్రౌపది వంటి హిందూ దేవతలను అవమానించడంతో పాటు గరికపాటి వంటి వ్యక్తులను విమర్శించాడు. దీంతో నెటిజన్లు భారీగా అన్‌ఫాలో చేస్తూ అతని అకౌంట్లను రిపోర్ట్ చేస్తున్నారు — ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు 1.8 మిలియన్ల నుంచి 1.6 మిలియన్లకు తగ్గిపోయారు. ఈ దుమారానికి స్పందిస్తూ అన్వేష్ క్షమాపణ వీడియో పోస్ట్ చేశాడు, కానీ నెటిజన్లు అతని అరెస్ట్, ఛానల్ మూసివేత వంటి కఠిన చర్యలు డిమాండ్ చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, మత భావాలను గాయపరిచినందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. అన్వేష్ విదేశాల్లో ఉండి ఇండియాకు రాకూడదని చెప్పడంతో పాస్‌పోర్ట్ సీజ్, ఇంటర్‌పోల్ సాయం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బలపడుతున్నాయి, కేవలం క్షమాపణలతో సరిపోదని అంటున్నారు.
సీతమ్మ, ద్రౌపదిలను బలత్కారం చేసిన కీచకుడు, సైంధవుడు మరణించలేదా.. ? అని మాట్లాడాడు. గుడుల ముందు అర్ధనగ్న శిల్పాలు ఉంటాయి.. వాటిని తొలగించమని చెప్పండి అంటూ మండిపడ్డాడు. ఇలా ఒకటి అని కాదు.. నోటి దురదతో చాలానే మాటలు జారాడు. రామాయణం, మహాభారతం గురించి మాట్లాడడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. కేసులు కూడా పెట్టాయి. అంతేనా అతడి పద్దతి నచ్చక ఫాలోవర్స్ తగ్గడం మొదలయ్యింది. దీంతో చేసేది లేక అందరికీ సారీ చెప్పాడు.
'సీతాదేవికి, ద్రౌపది దేవికి క్షమాపణలు చెప్పమంటున్నారు. అదే చేత్తో శివాజీకి, గరికపాటి గారికి క్షమాపణలు, హిందూ సంఘాలకు చెప్పమన్నారు. వినాయకుడి సన్నిధానంలో నేను వారందరికీ క్షమాపణలు కోరుతున్నాను. దానికన్నా ముందు నేను ఏమన్నా.. ద్రౌపది దేవిని బలత్కారం చేయబోయిన కీచకుడు, సైంధవుడు చచ్చిపోయారు అని చెప్పాను. తరువాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లబోయి చచ్చిపోయాడు అన్నాను. ఇక్కడ అలా చేస్తున్నవారు బిర్యానీలు తింటూ దర్జాగా ఉంటున్నారని అన్నాను. అక్కడ అంత చెప్పడానికి లేదు కాబట్టి చెప్పలేదు. తప్పు దొర్లింది.. నేను ఒప్పుకుంటున్నా. అందుకే క్షమాపణలు కోరుతున్నా.. నాదే తప్పు అయితే ఈ రాత్రికి రక్తం కక్కుకొని చచ్చిపోతా.. అదే ఈ తప్పును మీరు క్షమించకపోతే ఈ ఏడాది అంతా అష్టదరిద్రాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతారు. గరికపాటి గారికి, శివాజీగారికి కూడా సారీ చెప్తున్నా.. నేనన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!