

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన బోర్డు తొలి సమావేశం సోమవారం విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్‌లో నిర్వహించబడింది. కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌తో పాటు బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో సినీ, టెలివిజన్, థియేటర్ రంగాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, చిత్ర పరిశ్రమకు అనుకూల వాతావరణం కల్పించడం, పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్ రూపొందించడం వంటి అంశాలపై బోర్డు చర్చించింది. కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేసింది. నంది అవార్డులపై ప్రత్యేకంగా చర్చిస్తూ భవిష్యత్ అవార్డుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, సిఫార్సులపై అభిప్రాయాలు వ్యక్తం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!