

DJ టిల్లూతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు విమల్ కృష్ణ మరో వినోదభరితమైన సినిమాతో తిరిగి రానున్నారు. ఆయన కొత్త చిత్రం ‘అనుమాన పక్షి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా సినిమా టీమ్ కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. అందమైన లోకేషన్లలో షూట్ చేసిన ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, రాజేష్ జాగ్తియాని, హీరాచంద్ దండ నిర్మిస్తున్నారు. ఆ ఒక్కటి అడక్కు వంటి చిత్రాల తర్వాత ఇది వారి నాలుగో ప్రాజెక్ట్.
సంగీతాన్ని శ్రీ చరణ్ పకాల అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని సునీల్ కుమార్ నామా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రిన్స్ సిసిల్, అనన్యా, చారిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
విమల్ కృష్ణ ప్రత్యేకమైన హాస్యశైలిని కొనసాగిస్తూ, ఈసారి కూడా ప్రేక్షకులను నవ్వించే ఎంటర్టైనర్ను అందించనున్నారని సమాచారం. సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!