
జనరల్

రాగ్ మయూర్ హీరోగా, ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘అనుమాన పక్షి’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘డీజే టిల్లు’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రిన్స్, బ్రహ్మాజీ, రాశి, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!