

ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మూడు వరుస విజయాలతో స్టార్ ఎంటర్టైనర్గా నిలిచిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ నెల 14 న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు వచ్చిన స్పందన అంచనాలను మరింత పెంచింది.
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన నవీన్ పొలిశెట్టి, సంక్రాంతి పండుగకు సంబంధించిన ఆనందం, కుటుంబ అనుబంధం, హాయిగా నవ్వుకునే వాతావరణం ఈ సినిమాలో ప్రతిబింబిస్తాయని చెప్పారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, గోదావరి నేపథ్యంతో సాగే ఈ కథలో కామెడీతో పాటు మంచి భావోద్వేగం, రాజకీయ వ్యంగ్యం కూడా ఉంటాయని తెలిపారు. దర్శకుడు మారి దీనిని పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్గా అభివర్ణించగా, మీనాక్షి చౌదరి మరియు బాల నటుడు రేవంత్ కుటుంబంతో కలిసి థియేటర్లలో సినిమా చూసి సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని ప్రేక్షకులను కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!