

బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్ తన చిన్నతనంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకుంది. ఓ విషాదకర రోడ్డు ప్రమాదంలో తన బామ్మను ఎలా కోల్పోయిందో చెప్పుకొచ్చింది.
ఆ సంఘటన గురించి మాట్లాడుతూ అలియా భావోద్వేగానికి లోనైంది. ఆ ప్రమాదం తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిందని, అదే తనలో రోడ్ సేఫ్టీపై అవగాహన పెరగడానికి కారణమైందని వెల్లడించింది.
అలియాకు 12 ఏళ్ల వయసున్న సమయంలో, ఆమె బామ్మ (నానీ) తన భర్తతో కలిసి గుడికి వెళ్తుండగా ఓ ట్రక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపింది.
ఆ ఘటన తర్వాత తమ కుటుంబంలో ఒకరకమైన భయం నెలకొందని, ముఖ్యంగా తన భద్రత విషయంలో తల్లి చాలా ఆందోళన చెందేదని అలియా చెప్పింది. అప్పటినుంచి రోడ్లపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు మరింత పెరిగాయని పేర్కొంది.
అయితే తాను తల్లి అయిన తర్వాత సేఫ్టీపై తన దృక్పథం మరింత మారిందని అలియా స్పష్టం చేసింది. తన బిడ్డ కోసం అయినా ఎక్కువ బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నానని, రోడ్ సేఫ్టీని ఎప్పటికీ తేలికగా తీసుకోవద్దని ఆమె సూచించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!