

అఖండ 2: ది తాండవం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం గ్రాండ్ ప్రీమియర్ల తర్వాత శుక్రవారం థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రారంభమైంది. అభిమానుల సంబరాల మధ్య తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బాలయ్యతో పాటు దర్శకుడికీ కొత్త రికార్డులను సృష్టించింది.
ప్రీ-రిలీజ్ హైప్ పూర్తిగా కలెక్షన్లలోకి మారడంతో బుక్‌మైషోలోనే అర మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోయాయి. అమెరికాలో కూడా ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌ను నమోదు చేస్తూ 5 లక్షల డాలర్ల మార్క్‌ను దాటింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మించగా, ఎం తేజస్విని నందమూరి ప్రెజెంట్ చేసిన ఈ చిత్రం, తొలి వీకెండ్లో మరింత భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్లనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!