

సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మెరుపు ధర్నా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేశ్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.
నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలకు వెళ్లేందుకు రైళ్లు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని జనరల్ మేనేజర్ కార్యాలయం వెలుపల కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైళ్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!