
.jpg&w=3840&q=75)
లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను తో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5 న భారీగా విడుదల కానుంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన హర్షాలి మల్హోత్రా తాజాగా తన అనుభవాలను పంచుకుంది. బాలకృష్ణతో కలిసి నటించే అవకాశం దక్కడం తనకు పెద్ద అదృష్టమని ఆమె చెప్పింది. తాను చేసిన ‘జనని’ పాత్ర కథలో ముఖ్యమైన భాగమని తెలిపారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత థియేటర్ల లోకి వస్తున్నానని, తన రెండో సినిమా కూడా తెలుగులో రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి మాట్లాడిన హర్షాలి ఆయన చాలా కూల్ గా ఉంటారని, సెట్లో ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారని చెప్పింది. బాలయ్య లోని ఎనర్జీ, అన్స్టాపబుల్ నేచర్ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు. షూటింగ్ సమయం లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలో పని చేయాల్సి వచ్చినా బోయపాటి శ్రీను ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆ సన్నివేశాలు సులభంగా పూర్తి చేశానని వివరించింది.
తదుపరి ప్రాజెక్టుల గురించి హర్షాలి మాట్లాడుతూ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని కోరిక వ్యక్తం చేసింది. ఆయన హీరోయిన్లను చూపించే తీరు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని ఆమె చెప్పింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!