

ఓవైపు బండ్ల గణేశ్ పై విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా మొత్తం బండ్ల గణేశ్ పై తిట్ల దండకమే కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో మరోసారి ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు బండ్ల గణేశ్. అయితే ఆయన ప్రస్తుతం నడుస్తున్న వివాదంపై అస్సలు స్పందించలేదు. తనపై జరుగుతున్న మరో ప్రచారంపై ఆయన స్పందించారు.
"మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి కాని వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.” ఎవ్వరూ అడక్కుండానే, తనకుతానే ఈమధ్య ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు బండ్ల గణేశ్. తను హిట్టిచ్చిన తర్వాతే గ్యాప్ తీసుకున్నానని, త్వరలోనే అదిరిపోయే సినిమాతో అందరి ముందుకు వస్తానంటూ స్వీయ ప్రకటన చేసుకున్నారు.
గతంలో ఆయన పవన్ తో సినిమా ఎనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి, సహజంగా బండ్ల-పవన్ కాంబోలో సినిమా అంటూ ప్రచారం నడిచింది. ఆ తర్వాత చిరంజీవి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. బండ్ల ఇచ్చిన దీపావళి పార్టీకి చిరంజీవి రావడం వల్ల ఈ పుకారు మొదలైంది. ఇలా తన రీఎంట్రీపై వస్తున్న పుకార్లను బండ్ల గణేశ్ ఖండించారు. అంతేతప్ప, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ పై మాత్రం ఆయన రియాక్ట్ కాలేదు. అంటే, ఆ ఇష్యూను బండ్ల లైట్ తీసుకున్నట్టే అనుకోవాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!