
సినిమాలు

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఫీల్ మై లవ్ సినిమా టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్నారు.

హరి ప్రకాష్ ఎం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. చెన్నై, పుదుచ్చేరి, మున్నార్ లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అనేక భాషల్లో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!