

నాగచైతన్య, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా తొలి పాట టైటిల్‌ను ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’గా ప్రకటించిన మేకర్స్.. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తొలి పాటతో ప్రారంభం కానున్న సంగీత ప్రచారం, తదుపరి ప్రమోషనల్ అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను పెంచే అవకాశం ఉంది.
‘లాపతా లేడీస్’ చిత్రంతో గుర్తింపు పొందిన స్పర్శ్ శ్రీవాస్తవ ‘వృషకర్మ’లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ‘వృషకర్మ’ను 2026 డిసెంబర్ 4న పలు భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. తొలి పాట ప్రకటనతో సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!