

టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘హుషారు’, ‘జాతిరత్నాలు’ వంటి చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలతో పాటు తనదైన శైలిలో చేసే వ్యాఖ్యలు, పోస్టులతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం ‘హుషారు-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు హీరోగా నటించాలనే ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
‘హుషారు-2’ పూర్తయిన తర్వాత దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు రాహుల్ రామకృష్ణ తెలిపారు. వచ్చే ఏడాదిలోనే తన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి హాస్యభరిత కథాంశంతో రూపొందిస్తున్నట్లు, కథతో పాటు స్క్రీన్‌ప్లేను కూడా తానే సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయిందని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించి సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. నటుడిగా తన కామెడీతో అలరించిన రాహుల్, దర్శకుడిగా ఎలాంటి వినోదాన్ని అందిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!