

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులపై అభియోగాలు నమోదు చేసే అంశంపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఈ నెల 18న ఉత్తర్వులు వెలువరించనున్నట్లు కోర్టు తెలిపింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొంది. అభియోగాల నమోదు విషయంలో కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
ఈ కేసులో సీబీఐ 2026 జూలైలో 13 మంది నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. అనంతరం శేషరావు బజరంగ్ సూర్యవంశీ అనే 14వ నిందితుడిపై అనుబంధ ఛార్జిషీట్‌ను సమర్పించింది. ప్రధాన ఛార్జిషీట్‌ను కోర్టు 2026 ఆగస్టులో పరిగణనలోకి తీసుకుంది. నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ 2026 మేలో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం అభియోగాల నమోదుపై కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!