

‘ఆర్ఎక్స్-100’ చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ‘వెంకటలచ్చిమి’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సినిమా టికెట్ ఎంటర్‌టైన్మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ బ్యానర్‌లపై రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, పంజాబీ భాషల్లో విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన పాయల్ రాజ్‌పుత్, ‘వెంకటలచ్చిమి’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. అలాగే తన కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలో ప్రకటిస్తానని చెప్పింది. ప్రేక్షకులు తన కోసం ఎదురుచూడటం కంటే, తానే మళ్లీ పెద్ద తెరపై ప్రేక్షకుల ముందుకు రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో తన నుంచి ఒక పెద్ద అప్డేట్ రానుందని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!