

ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె, పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఎన్సీపీ (ఎస్‌పీ) ఎన్డీఏకు మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మోదీ-పవార్ భేటీలో చర్చించిన అంశాలను ఇరు వర్గాలు అధికారికంగా వెల్లడించలేదు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఎన్సీపీ (ఎస్‌పీ) కొన్ని షరతులతో మద్దతు ఇవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్డీఏలో చేరికపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ భేటీ భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమా లేక మర్యాదపూర్వక సమావేశమా అనే చర్చ కొనసాగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!