

రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడటం మీ ప్రశాంతతకు ప్రధాన శత్రువు
మొబైల్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర హార్మోన్లను దెబ్బతీసి, నిద్రను ఆలస్యం చేస్తుంది. ఈ అలవాటు వల్ల కళ్లు దెబ్బతినడం, ఒత్తిడి, బరువు పెరుగుదలతో పాటు దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి 10 ప్రమాదాలు తప్పవు.
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఉదయం లేచిన వెంటనే మొబైల్ స్క్రీన్ చూడటం, రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం లేదా వీడియోలు చూడటం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు మీ ప్రశాంతమైన నిద్రకు అతిపెద్ద శత్రువు.
పడుకునే ముందు మొబైల్ ఫోన్ వాడకం వల్ల కలిగే 10 హానికర ప్రభావాలు
నిద్ర నాణ్యత దెబ్బతింటుంది: ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడులో మెలటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది.
నిద్ర ఆలస్యం: ఫోన్ వాడినప్పుడు మెదడు ఉత్తేజితమై, నిద్రపోవడం కష్టం అవుతుంది.
కంటికి నష్టం: అధిక కాంతి వల్ల కళ్ళు పొడిబారడం, దురద, తలనొప్పి వంటి సమస్యలు కలుగుతాయి.
ఒత్తిడి పెరుగుదల: నిరంతరంగా సోషల్ మీడియాలో బ్రౌజ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి.
మెదడుకు విశ్రాంతి లేదు: నిద్రపోయే ముందు ఫోన్ వాడితే మెదడుకు సరైన ప్రశాంతత లభించదు, అలసట తగ్గదు.
జ్ఞాపకశక్తి, శ్రద్ధ తగ్గుతుంది: సరైన నిద్ర లేకపోవడం వల్ల తదుపరి రోజున ఏ పనికీ దృష్టి పెట్టలేరు.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం: నిరంతర నిద్రలేమి కారణంగా గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
హార్మోన్ల అసమతుల్యత: తగినంత నిద్ర లేకపోతే, శరీరంలోని హార్మోన్లు సరిగా పనిచేయవు.
బరువు పెరగవచ్చు: నిద్ర లేకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు దెబ్బతినడం వల్ల బరువు పెరుగే అవకాశం ఉంటుంది.
మానసిక ఆరోగ్యం క్షీణత: ఫోన్ వ్యసనం, నిద్రలేమి, ఆందోళన కలిసి నిరాశకు దారి తీస్తాయి.
నిపుణుల చిట్కా:
మంచి నిద్ర, ఆరోగ్యకరమైన జీవితం కోసం, పడుకునే కనీసం 30–60 నిమిషాల ముందు ఫోన్ ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!