

చలి తీవ్రంగా పెరిగిన తరుణంలో చాలా మంది స్నానం చేయకుండా రోజులు గడిపేస్తున్నారు. వేడి నీటితో స్నానం చేసినా ఆ తర్వాత చలి ఎక్కువగా వేస్తుందంటూ స్నానాన్ని పూర్తిగా తప్పించుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
స్నానం చేయకపోతే శరీరంపై చెమట, దుమ్ము, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. దీంతో అలర్జీలు, రాషెస్, చర్మ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే శరీరం నుంచి దుర్వాసన రావడం వల్ల ఇతరుల ముందు ఇబ్బంది, అపహాస్యం ఎదురవుతుంది. అందుకే చలికాలం అయినా రోజూ తప్పనిసరిగా స్నానం చేయాలి అని వైద్యులు సూచిస్తున్నారు.
రోజువారీ స్నానం శరీరాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మనసుకు తాజాదనం ఇస్తుంది, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అందువల్ల చలికాలంలో కూడా వేడి నీటితో ప్రతిరోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.









.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!