

ఆరోగ్య నిపుణుల ప్రకారం, వేసవి కాలంలో ఉల్లిపాయను వండుకుని తినడం కంటే పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి గరిష్ట స్థాయిలో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా లంచ్ సమయంలో పచ్చి ఉల్లిపాయ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం, ఉప్పు చల్లి తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పచ్చి ఉల్లిపాయ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి ఎండదెబ్బ నుంచి రక్షిస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, లోపలి వేడిని తగ్గిస్తుంది. ఇవి కేవలం సంప్రదాయ నమ్మకాలే కాకుండా శాస్త్రీయంగా కూడా నిరూపితమైన ఆరోగ్య ప్రయోజనాలు.
వేసవిలో జీర్ణక్రియ మందగించడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు వస్తుంటాయి. పచ్చి ఉల్లిపాయలో ఉండే సాల్యూబుల్ ఫైబర్ పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఉల్లిపాయలో ఉన్న క్వెర్సిటిన్ రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా దోహదపడుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగ సమస్యలు ఎదురైతే అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!