

ఆధునిక జీవనశైలిలో సమయం కొరత కారణంగా చాలా మంది ఇన్స్టంట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఆహారాలు, దీర్ఘకాలం నిల్వ ఉండే పానీయాలపై ఆధారపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆహారం ఎక్కువకాలం పాడవకుండా ఉండేందుకు వాడే కొన్ని ప్రిజర్వేటివ్స్ మన శరీరానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ పారిస్ సిటీ పరిశోధకులు 1,05,260 మందిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో వాడే కొన్ని కెమికల్స్ క్యాన్సర్ ముప్పును గణనీయంగా పెంచుతున్నట్లు తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ప్రతిష్ఠాత్మక ‘బీఎంజే (BMJ)’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఈ పరిశోధనపై స్పందించిన ఆంకాలజిస్టులు మాట్లాడుతూ, పొటాషియం సోర్బేట్, సోడియం నైట్రైట్, నైట్రేట్లు, సల్ఫైట్లు వంటి ప్రిజర్వేటివ్స్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని తెలిపారు. “ఈ రసాయనాలు శరీరంలో వాపును పెంచి, రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ కణాలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది” అని డాక్టర్లు స్పష్టం చేశారు. అందుకే వీలైనంత వరకు తాజా ఆహారం తీసుకోవాలని, ప్యాకెట్‌పై ఉన్న లేబుల్స్‌ను తప్పనిసరిగా చదవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!